FbTelugu

బంగారం కోసం.. వ్యక్తి దారుణ హత్య!

గుంటూరు: ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలోని పెదకూరపాడు మండలం, కాశిపాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాధాకృష్ణమూర్తి అనే వ్యక్తి కాశిపాడులో చిల్లరకొట్టు నడుపుకునే వ్యాపారి.

ఇతనిపై కొందరు గుర్తుతెలియని దుండగురు దాడిచేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like