FbTelugu

తిరుమలలో మళ్లీ భక్తులు తగ్గారు

తిరుమల: కరోనా సెకండ్ వేవ్ మహమ్మారితో మంగళవారం నాడు తిరుమలలో భక్తులు అమాంతం తగ్గారు. అంతకు ముందు రెండు మూడు రోజులు భక్తులు పెరిగినట్లు కన్పించినప్పటికీ మళ్లీ గణనీయంగా తగ్గిపోయారు.

కలియుగ దైవాన్ని దర్శించుకున్నవారు 5వేల లోపే ఉండడం గమనార్హం. శ్రీ వేంకటేశ్వరుడిని 4,723 మంది భక్తులు దర్శించుకోగా, 2669 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం కూడా రూ.39 లక్షలకు పడిపోయింది. కరోనా కారణంగా తిరుపతిలో ఇస్తున్న సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు నిలిపివేసిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.