హైదరాబాద్: తెలంగాణలో రికార్డు స్థాయిలో కొత్తగా 887 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత కొన్ని రోజులుగా ఇతర రాష్ట్రాలలో కేసులు పెరుగుతుండడంతో ఇక్కడ కూడా కేసుల నమోదు పెరుగుతోంది.
నిన్న మొన్నటి వరకు తక్కువ సంఖ్యలో కేసులు రాగా… పొరుగు రాష్ట్రాలలో కేసుల సంఖ్య పెరగడంతో ఇక్కడ కూడా పెరిగినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో అధికంగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు 59,297 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 887 కరోనా కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో నలుగురు మృతిచెందగా, 337 మంది బాధితులు కోలుకున్నట్లు వెల్లడించారు.