FbTelugu

రెండు జిల్లాలకు కొత్త పేర్లు: సిఎం కెసిఆర్

వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా ను ఇక నుంచి హన్మకొండగా పిలవాలని, వరంగల్ రూరల్ ను వరంగల్ గా మార్చుతున్నట్లు సిఎం కెసిఆర్ ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ అవుతాయన్నారు.
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం తరువాత కెసిఆర్ ప్రసంగించారు. ఇవాళ ప్రారంభించుకున్న భవనాన్ని హన్మకొండగా పరిగణిస్తామని చెప్పారు.

దీనికి సమీపంలో నిర్మించే నూతన భవనాన్ని వరంగల్ జిల్లా కలెక్టరేట్ గా గుర్తిస్తున్నట్లు ఆయన తెలిపారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ ను త్వరలోనే నిర్మాణం చేస్తామన్నారు. రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణలు బాగా తెచ్చుకున్నాం, అవన్నీ పరిపుష్టం కావాలన్నారు. హైదరాబాద్ వాళ్లు ఈర్ష్య పడే విధంగా వరంగల్ లో వైద్య సదుపాయాలు ఉండాలన్నారు. పాత జైలు ప్రాంగణంలో ఏడాదిన్నర లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణం పూర్తి కావాలన్నారు. సెంట్రల్ జైలు కూల్చితే నాకేమైనా వస్తాదా, దాని మీద కూడా కొందరు విమర్శలు చేశారన్నారు. ధరణి ఫోర్టల్ తో రిజిస్ట్రేషన్ సమస్యలు తీరాయని, పారదర్శకత పెరిగితే బ్రోకర్లు ఉండరని సిఎం అన్నారు. వరంగల్ కు డెంటల్ కాలేజీని మంజూరు చేస్తున్నట్లు కెసిఆర్ ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.