FbTelugu

సీమ ఎత్తిపోతలపై ఎన్.జి.టి ఆగ్రహం

చెన్నై: అనుమతుల్లేకుండా చేపడుతున్న ఎత్తిపోతల పథకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్.జి.టి) ఏపి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలకు విరుద్గా పనులు కొనసాగిస్తే జైలు పంపిస్తామని ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హెచ్చరించింది.

పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టవద్దని గతంలో ఎన్.జి.టి ఆదేశించింది. గతంలో జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించి పనులు చేస్తున్నారంటూ ఎన్.జి.టిలో ఫిర్యాదు చేయడంతో ఇవాళ విచారించింది. ఎత్తిపోతలపై తాజాగా పరిస్థితి పై నివేదిక ఇవ్వాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కెఆర్ఎంబి) ని ఎన్.జి.టి ఆదేశించింది. తదుపరి విచారణ ను జూలై 12 తేదీకి వాయిదా వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.