FbTelugu

ఎమ్మార్వో పేరు రాసి.. రైతు ఆత్మహత్య

పెద్దపల్లి: ఓ రైతు సూసైడ్ నోట్ లో ఎమ్మార్వో, వీఆర్ఓ పేర్లను రాసి పురుగుల మందు తాగి తహశీల్దార్ కార్యాలయం ఎదుటే ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. మందల రాజిరెడ్డి అనే రైతు తన భూమిని రికార్డుల్లోకి ఎక్కించడం లేదంటూ మనస్తాపం చెంది కాల్వశ్రీరాంపూర్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకున్నారు. తహశీల్దార్ వేణుగోపాల్, వీఆర్ఓ గురుమూర్తి స్వామి పేరు సూసైడ్ నోట్ లో రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.