FbTelugu

డిసెంబర్ లో సినిమానే… నివేదిక ఇవ్వాలి: సుప్రీం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మళ్లీ విజృంభించే అవకాశాలు ఉన్నందున సుప్రీంకోర్టు ఇవాళ కొన్ని రాష్ట్రాల నుంచి నివేదికలు కోరింది. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, అస్సాం రాష్ట్రాలు… రెండు రోజుల్లో నివేదిక అందచేయాలని ఆదేశించింది.
జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం కరోనా కేసులపై విచారణ చేపట్టింది. వైరస్ నియంత్రణ కోసం ఏ చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని సంబంధిత రాష్ట్రాలను కోరింది. దేశ రాజధాని నగరం ఢిల్లీ, గుజరాత్ లో కేసులు అధికంగా నమోదు కావడంతో ఆ రాష్ట్రాలను సుప్రీంకోర్టు మందలించింది. 2020 డిసెంబర్ నెలలో కేసుల తీవ్రత అధికంగా ఉటుందని, భయానక పరిస్థితులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.

కరోనాపై అన్ని రాష్ట్రాలకు సంబంధించిన తాజా నివేదికలు సమర్పించాలని, ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా లేనట్లయితే పరిణామాలు ఘోరంగా ఉంటాయని సుప్రీం అభిప్రాయపడింది. వ్యాక్సిన్ పంపిణీ పై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నాడు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలు వ్యాక్సిన్ ను మూడో దశ, చివరి దశ ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. ఏ వ్యాక్సిన్ తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్లాలని దానిపై ఆయన చర్చించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.