తిరుపతి: కరోనా విపరీతంగా పెరిగిపోతున్న కారణంగా ప్రస్తుతానికి రాజధాని తరలింపు ఆలోచన లేదని రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో జూలై నాటికి కరోనా కేసులు మూడింతలు అయ్యే అవకాశముందని, ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని తరలించలేమని ఆయన అంగీకరించారు. అయితే రాజధానిపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. తరలింపు నిర్ణయం జరిగిపోయిందని, గవర్నర్ ప్రసంగంలో కూడా మూడు రాజధానుల విషయాన్ని ప్రస్తావించారని మంత్రి పెద్దిరెడ్డి గుర్తు చేశారు.