FbTelugu

ఇద్దరు పిల్లల్నిచెరువులో తోసేసిన తల్లి

సూర్యపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యభర్తల మధ్య చోటుచేసుకున్న గొడవతో తన పిల్లలిద్దరిని చెరువులో తోసేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రశాంత్‌కుమార్‌, నాగమణి అనే భార్యాభర్తలు స్థానిక విద్యానగర్‌లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు హర్షవర్ధన్‌, జ్యోతిమాధవి లు ఉన్నారు.

కాగా భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో తన ఇద్దరు పిల్లలను స్థానిక సద్దుల చెరువులో పడేసింది. ఇవాళ ఉదయం ఆ చెరువద్ద ఉన్న ఆమెను స్థానికులు ప్రశ్నించగా తన ఇద్దరు పిల్లలను అందులో పడవేసినట్టు చెప్పింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం హర్షవర్థన్ మృతదేహం లభ్యం అయింది. జ్యోతి మాధవి మృతదేహం కోసం గాలిస్టున్నారు.

You might also like