FbTelugu

అతి తెలివి ప్రదర్శించిన దొంగ.. అయినా దొరికి పోయాడు

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఓ గజదొంగ అతి తెలివి ప్రదర్శించి బంగారాన్ని దొంగిలించినా ఒక్కరోజులోనే పోలీసులకు దొరికి పోయాడు. వివరాల్లోకెళితే..
ఢీల్లీలోని ఓ జూవెలరీ షాపులోకి ఓ దొంగ పీపీఈ కిట్ ధరించి చొర‌బ‌డ్డాడు. ఆ సమయంలో సెక్యూరిటీ గాడ్స్ ఉన్నప్పటికీ అతన్ని గుర్తించ లేక పోయారు. కానీ అక్కడి సీసీ టీవీల్లో ఈ తతంగం మొత్తం రికార్డయింది.

ఆ షాపులోకి ఏకంగా రూ.13 కోట్లు విలువ చేసే 25 కేజీల బంగారాన్ని దోచుకెళ్లాడు. సీసీ టీవీ పుటీజీల ఆధారంగా దుండగున్ని పట్టుకున్నారు. నిందితుడు మ‌హ్మద్ షేక్ నూర్‌ క‌ర్ణాట‌క‌కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడు జువెల‌రీ షాపు ప‌క్క‌నే ఉన్న ఓ ఎల‌క్ట్రానిక్స్ షాపులో ప‌ని చేస్తున్నట్టు తెలుస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.