FbTelugu

తమిళనాడును తాకిన రుతుపవనాలు

హైదరాబాద్: నేటికి  నైరుతి రుతుపవనాలు కేరళను పూర్తిగా వ్యాపించేశాయి. తాజాగా కేరళ పక్కనే ఉన్న తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లోకి రుతుపవనాలు వ్యాపించినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాల దాటికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కాగా.. అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

You might also like