FbTelugu

తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. నిజామాబాద్ వరకు రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 48 గంటల్లో తెలంగాణ అంతటా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు రుతుపవనాలు వ్యాపించాయి.

You might also like