FbTelugu

15 ఏళ్లలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

* 1.1 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత

న్యూఢిల్లీ: భారత్ లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో 15 ఏళ్లలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ ఉదయం అత్యల్పంగా 1.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

గతంలో 2006లో జనవరిలో అత్యల్పంగా 0.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని విశాఖ ఏజెన్సీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదౌతుండగా.. తెలంగాణలోని అదిలాబాద్, అసీఫాబాద్ లలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.