FbTelugu

ఒక్క ఆర్టీసి డిపో నష్టం రూ.8 కోట్లు

బెంగళూరు: కరోనా మహమ్మారిలో పలు సంస్థలు కుదేలవుతున్నాయి. ఇప్పటికే నష్టాల్లో మూలుగుతున్న సంస్థలు మరింతగా నష్టపోయి కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నాయి.

కర్ణాటక రాష్ట్రంలో గంగావతి ఆర్టీసి డిపోలో సుమారు వంద బస్సులు ఉన్నాయి. వీటిని ప్రతినిత్యం వంద మార్గాల్లో నడుపుతుంటారు. కరోనా సెకండ్ వేవ్ తో రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అప్పటి నుంచి ప్రతిరోజు రూ.16 లక్షల నష్టం వాటిల్లుతోంది. ప్రయాణీకులు లేకపోవడంతో ఏప్రిల్ 27వ తేదీ నుంచి బస్సులను నడపడం పూర్తిగా నిలిపివేశారు. ఫలితంగా రూ.8 కోట్ల నష్టం వాటిల్లింది. ఆదాయం లేకపోవడం, ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందికి వేతనాలు ఇవ్వడం లేదు. కరోనా సమయంలో జీతం ఇవ్వకపోతే ఎలా అని సిబ్బంది ప్రశ్నిస్తున్నారని డిపో మేనేజర్ సంజీవ మూర్తి తెలిపారు. ఇప్పటి వరకు డిపోలో పనిచేస్తున్న 17 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ సోకిందన్నారు. కరోనా బాధితుల కోసం నాలుగు ఆక్సిజన్ బస్సులు ప్రారంభించామని, వాటి నిర్వహణ కోసం సిబ్బందిని పిలుస్తున్నామని తెలిపారు. సెకండ్ వేవ్ కారణంగా తమ డిపో రూ.8 కోట్లు నష్టాల్లో కూరుకుపోయిందని సంజీవ మూర్తి తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.