FbTelugu

తబ్లిగీ వల్లే లాక్‌డౌన్ పొడగించాం: కేంద్ర మంత్రి నఖ్వీ

ఢిల్లీ: నిజాముద్దీన్ మర్కజ్ మసీద్ లో మతపర కార్యక్రమాల మూలంగానే దేశంలో లాక్ డౌన్ గడువు పొడగించాల్సి వచ్చిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పష్టం చేశారు.

దేశంలో లాక్‌డౌన్ 3.0 పొడగింపునకు కారణం తబ్లిగీ జమాతే కారణమని ఆయన అన్నారు. అక్కడ మతపర కార్యక్రమం లేనట్లయితే మూడో దశ లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితులు వచ్చి ఉండేవి కాదన్నారు. నిజాముద్దీన్ మర్కజ్ మసీదును సూపర్ స్ర్పెడర్ గా ఆయన అభివర్ణించారు.

ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నిజాముద్దీన్ మర్కజ్ మసీదు మౌలా నిర్లక్ష్యాన్ని సాకుగా చూపి ముస్లిం సమాజాన్ని బాధ్యులుగా చూడవద్దన్నారు. మసీదు కమిటీ సభ్యులు పెద్ద తప్పిదం చేశారని, చట్ట ప్రకారం వారికి శిక్ష పడాల్సిందేనన్నారు. వారి నిర్లక్ష్యం కారణంగానే దేశంలో మూడో దశ లాక్ డౌన్ అమలవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆరేళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై ఎలాంటి ప్రశ్నలూ లేవనెత్తరని అన్నారు. వారి పని నిత్యం నకిలీ వార్తలు సృష్టించడమేనన్నారు. ఇది హిందూఫోబియానో, ఇస్లాంఫోబియానో కాదు. ప్రపంచం ముందు దేశం ఇమేజ్‌ని పాడు చేసే ప్రయత్నమేనని ఆయన అన్నారు.

You might also like