FbTelugu

ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లో ఉంది…!

చెన్నై: తమిళనాడులో ఇంకా లాక్ డౌన్ అమల్లో ఉంది. కేసుల ఆధారంగా 38 జల్లాలను మూడు విభాగాలు విభజించింది. మొదటి విభాగంలో 11 జిల్లాలను కరోనా వైరస్ హాట్ స్పాట్ గా ప్రకటించింది.

తక్కువ కేసులు ఉన్న విభాగంలో 23 జిల్లాలు ఉండగా, మూడో విభాగంలో చెన్నై నగరం తో మరో మూడు జిల్లాలు ఉన్నాయి. జూలై 5వ తేదీ వరకు లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నై తో పాటు తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్లు జిల్లాల్లో ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు మాల్స్, ప్రభుత్వ కార్యకలాపాలకు అనుమతించారు. 50 శాతం తో మాత్రమే పనిచేయాలని, ఏయర్ కండిషనర్లు ఉపయోగించవద్దని స్పష్టం చేసింది. దేవాలయాలు, చర్చీలు, మసీదులు కూడా తెరుచుకునేందుకు అనుమతించింది. అయితే కోయంబత్తూరు సహా 11 జిల్లాల్లో ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. శుక్రవారం నాడు తమిళనాడు రాష్ట్రంలో 5,775 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 150 మంది చనిపోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.