ఢిల్లీ: ఎల్జీ పాలీమర్స్ కంపెనీకి సుప్రీంకోర్టులో మళ్లీ చుక్కెదురు అయ్యింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
తమ కంపెనీ సీల్ చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎల్జీ పాలీమర్స్ రెండో సారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సంస్థ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు లో ఇవాళ విచారణ జరిగింది. ప్లాంట్ను సీల్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని సంస్థ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు.
వాదోపవాదనల తరువాత… సీల్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని భావించట్లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి విపత్కర సమయంలో ఇందులో జోక్యం చేసుకోవాలనుకోవట్లేదని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది.