FbTelugu

వలస కార్మికుల కోసం చట్టం చేయాలి: వీహెచ్

హైదరాబాద్: దేశంలో లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల కోసం ఓ చట్టం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ.హనుమంతరావు అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. గతంలో పవర్ లో ఉన్న వాళ్లు వలస కూలీలకు ఆదుకొని సాయం చేయాలంటూ కోరారు. అయితే కొందరు నాయకులకు ఫోన్ చేసినా ఏమాత్రం స్పందించడం లేదని అన్నారు. పదవుల్లో ఉన్నపుడు సంపాదించారు కదా ఇప్పడు సాయం చేయండి అంటూ ప్రశ్నించారు.

You might also like