అమరావతి: తప్పు చేసిన వారిని చట్టం వదిలిపెట్టదని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టును ఉద్దేశించి ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. దొంగ పనులు
చేస్తుంటే అరెస్టు చేయకుండా ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుదా అని ప్రశ్నించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికారం చెలాయించిన ప్రభుత్వం ఎవరిదో ప్రజలకు తెలుసునని అన్నారు. కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం దారుణమని అన్నారు.