FbTelugu

చివరి 4 అంకెల ‘‘ఆధార్’’ సురక్షితం

న్యూఢిల్లీ: దేశంలో ప్రభుత్వ కార్యాలయాలు లేదా గుర్తింపు కోసం ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు జిరాక్స్ అడుతున్నారు. పూర్తి నెంబర్ ఉన్న ఆధార్ ను సమర్పించాల్సి రావడంతో పలువురు పునరాలోచనలో పడుతున్నారు.
ఈ సమస్య నుంచి పౌరులను రక్షించేందుకు యుఐడిఏఐ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. మాస్క్ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.

కొత్తగా తీసుకువచ్చిన ఈ ఆఫ్షన్ మూలంగా ఈ ఆధార్ డౌన్ లోడు చేసి ప్రింట్ తీసుకున్నా చివరి నాలుగు అంకెలు మాత్రమే కన్పిస్తాయి. మిగతా అంకెలకు క్రాస్ గుర్తు ఇస్తారు. దీనివల్ల ఆధార్ నెంబర్ ఇతరులు తెలుసుకునే అవసరం ఉండదు. ఈ ఫీచర్ తో వ్యక్తిగత గోప్యత లభిస్తుందని యుఐడిఏఐ వెల్లడించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.