FbTelugu

వాహన యజమానులకు గుడ్ న్యూస్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు మరింత వెసులుబాటు కల్పించింది. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ విషయంలో కీలక నిర్ణయం ప్రకటించింది.

గతంలో జూన్ 30వ తేదీ వరకు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్, ఆర్.సి వంటి డాక్యుమెంట్ల గడువును సెప్టెంబర్ 30, 2021 వరకు పొడిగించింది. దీనికి సంబంధించింది కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. గత ఏడాదిలో ఫిబ్రవరి 1న ముగిసిన అన్ని వాహన పత్రాల గడువు సెప్టెంబర్ 30, 2021 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.