FbTelugu

పాక్ కు అంతర్జాతీయ న్యాయస్థానం మొట్టికాయలు

పాకిస్థాన్ కు అంతర్జాతీయ న్యాయస్థానంలో చుక్కెదురైంది. గూఢచర్యం ఆరోపణలపై మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ ను పాక్ చెరలో ఉంచిన కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం మరోసారి తీవ్రంగా తప్పుబట్టింది. కులభూషణ్ జాదవ్‌ను 2016లో పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. అనంతరం 2017లో పాక్ మిలిటరీ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించగా.. నెదర్లాండ్స్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ సవాల్ చేసింది. కాగా.. వియత్నాం ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందంటూ ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడు అబ్దుల్‌ఖావీ యూసఫ్ తాజాగా విన్నవించారు. పాక్ ముఖ్యంగా వియత్నం ఒప్పందంలోని ఆర్టికల్ 36ను ఉల్లంఘించిందని తెలిపాడు. దీనిపై పాక్ తక్షణ దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.

You might also like