FbTelugu

పెట్రోల్ బాదుడు ఆపలేదు…

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఆగడం లేదు. ప్రతి రోజు పెంచిన విధంగా ఇవాళ కూడా పెంచారు. ఒక రోజు విరామం ఇచ్చి మరుసటి రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచారు. బిజెపి ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచే విధంగా ధరలు పెంచుతున్నదంటూ ప్రజలు విమర్శిస్తున్నారు.

శుక్రవారం పెట్రోల్‌పై లీటర్‌కు 29 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెంచాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 మార్క్‌ను దాటగా.. డీజిల్‌ సైతం రూ.100 వైపు పరుగులు పెడుతున్నది. దేశంలోనే అత్యధికంగా శ్రీగంగా నగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.106 మార్క్‌ను దాటగా.. డీజిల్‌ ధర రూ.99 దాటింది. పెంచిన ధరలతో ఢిల్లీ నగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.85కు, లీటర్ డీజిల్‌ రూ.86.75కు పెరిగింది. మే నెలలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ.5.53, డీజిల్‌ రూ.5.97 పెంపుదల చేశారు. ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి. ముంబయి లో లీటర్ పెట్రోల్‌ రూ.101.04, డీజిల్‌ రూ.94.15, హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.99.61, డీజిల్‌ రూ.94.56, చెన్నైలో పెట్రోల్‌ రూ.97.19, డీజిల్‌ రూ. 91.42, కోల్‌కతాలో రూ.95.80, డీజిల్‌ రూ.89.60, భోపాల్‌ రూ.104.01, డీజిల్‌ రూ.95.35, బెంగళూరులో పెట్రోల్‌ రూ.99.05, డీజిల్‌ రూ.91.97.

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ప్రతి జిల్లా, మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.