FbTelugu

అత్యధిక రెమ్యునరేషన్ హీరో ప్రభాస్

ఇండియా సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి దాకా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు మాత్రమే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారు.

ఒక్కో సినిమాకు కనీసం రూ.100 కోట్లు తీసుకుని సంతకాలు చేసి కాల్షీట్లు ఇస్తున్నారు. బడా హీరోల జాబితాలోకి టాలీవుడ్ హీరో ప్రభాస్ కూడా చేరిపోయారు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు బాహుబలిగా మారాడు. టాలీవుడ్ నుంచి వచ్చిన నటుడు ఇంతగా పారితోషికం తీసుకున్న దాఖలాలు లేవు. ఒకప్పుడు ఆయనకు టాలీవుడ్ లోనే అభిమానులు ఉండగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడం విశేషం. వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభాస్ తో మూడు సినిమాలు తీస్తున్నారు. రాధే శ్యామ్ తరువాత అంగీకరించిన సినిమాలకు రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్ వినపడుతోంది. ఈ సినిమాలు బాక్సాఫీసు వద్ద విజయవంతమైతే మరింత రెమ్యునరేషన్ పెరుగుతుందనడంలో సందేహం లేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.