FbTelugu

జగన్ సర్కార్ కు షాకిచ్చిన హైకోర్టు

అమరావతి: రాష్ట్రంలో మండల ప్రజా పరిషత్ (ఎంపిటిసి), జిల్లా ప్రజాపరిషత్ (జెడ్పిటిసి) ఎన్నికలను ఏపి హైకోర్టు రద్దు చేసింది. ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరపలేదని స్పష్టం చేసింది. ఏపీలో ఏప్రిల్ 7న ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నిక‌లు జరిగాయి. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ను స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ల‌పై హైకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు ఎన్నిక‌ల ప్ర‌క్రియ జ‌ర‌గ‌లేద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. కొత్త నోటిఫికేష‌న్ ప్ర‌కారం మళ్లీ ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ ఎన్నిక‌ల‌ను స‌వాల్ చేస్తూ టిడిపి, జ‌న‌సేన‌, బిజెపి కోర్టును ఆశ్ర‌యించాయి. మోడ‌ల్ కోడ్ ఆఫ్ కండ‌క్ట్ ను అనుసరించకుండా ఎన్నిక‌లు జ‌రిగాయ‌ని పిటీషనర్లు హైకోర్టుకు తెలిపారు. ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేయాలనే నిర్ణయానికి వచ్చింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.