FbTelugu

కరోనాపై మా ఆదేశాలు పాటించరా?: హైకోర్టు

హైదరాబాద్: కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు తాము గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.

కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలియచేస్తూ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ హైకోర్టకు నివేదిక సమర్పించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కుమారి హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారించింది. ప్రైవేటు హాస్పిటళ్లలో కరోనా చికిత్స ధరలు ఒకే విధంగా ఉండాలన్న ఆదేశాలను అమలు చేశారా? చికిత్సల గరిష్ట ధరలను సవరిస్తూ జిఓ ఇచ్చారా లేదా అని ప్రశ్నించింది. కరోనాపై సలహా కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలని నిలదింది. ఆర్.టి.పి.సి.ఆర్ టెస్టు ల్యాబ్ లు ఇంకా ఎప్పుడు ప్రారంభిస్తారని ధర్మాసనం అడిగింది.

గతంలో పలు ఆదేశాలు ఇచ్చామని, ఒక్కటీ అమలు కాలేదని, మూడో దశ సన్నద్ధతపై వివరాలు అసమగ్రంగా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో ఒకే జిల్లాలో 8వేల మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారని గుర్తు చేస్తూ మేము చెప్పినవి అన్నీ భవిష్యత్తులోనే చేస్తారా, ఇప్పుడేమి చేయరా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా చికత్స కోసం బంగారు ఆభరణాలు, ఇళ్లు, స్థలాలు తనఖా పెట్టి ఆసుపత్రుల్లో ఫీజులు చెల్లిస్తున్నరని, ఈ విషయాలు తెలుసా అని మండిపడింది. బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా ఉన్నందున అవసరమైన మందులు ఎందుకు సరఫరా చేయలేదో తెలపాని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రేపటికి (బుధవారం) వాయిదా వేసింది.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.