FbTelugu

గవర్నర్ పిలుపు… రాలేమన్న చీఫ్ సెక్రెటరీ

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా తీవ్రతపై గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సమావేశం నిర్వహించాలని రాజ్ భవన్ నుంచి ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు ఫోన్ వెళ్లింది.

మీతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి కూడా రావాలంటూ కోరారు. ఏమైందో ఏమో ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నందున సమావేశానికి రావడం లేదని ప్రధాని కార్యదర్శి రాజ్ భవన్ వర్గాలకు తెలిపారు. అయితే మంగళవారం రావాల్సిందిగా కోరారు. రాష్ట్రంలో పడకలు, వసతులు, మందుల లభ్యత, టెస్టుల సంఖ్య, ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాలతో గవర్నర్ సమావేశం కానున్నారు.

అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తారా లేదా రాజ్ భవన్ కు అహ్వానిస్తారా అనేది తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య, కేసుల తీవ్రతపై గవర్నర్ అసంతృప్తితో ఉన్నారు.

You might also like