FbTelugu

గవర్నర్, సీఎం ను క్వారంటైన్ పంపాలి

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ డిమాండ్

విశాఖపట్నం: లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, సీఎం వైఎస్.జగన్ లతో పాటు నూతన ఎన్నికల కమిషనర్ ను క్వారంటైన్ పంపాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ డిమాండ్ చేశారు

ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్‌గా ఇవాళ ఉదయం ప్రమాణస్వీకారం చేసిన జే.కనకరాజ్‌ తమిళనాడు రాష్ట్రం నుంచి ఏపీకి ఎలా వస్తారు? అని బండారు సత్యనారాయణ ప్రశ్నించారు. రాత్రికి రాత్రే చెన్నై నుంచి విజయవాడ వచ్చిన కనకరాజ్‌ను 14 రోజులు క్వారంటైన్‌కు పంపించాలని అన్నారు. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్, సీఎం జగన్ కూడా 14 రోజులు క్వారంటైన్‌లోకి వెళ్లాలని సత్యనారాయణ అన్నారు.

mp vijayasai met kanakaraj

లాక్ డౌన్ సమయంలో కనకరాజ్ బాధ్యతలు స్వీకరించడమే కాకుండా సమీక్షా సమావేశాలు నిర్వహించారన్నారు. ఆ తరువాత గవర్నర్ ను కూడా కలిశారన్నారు. ప్రభుత్వ పెద్దలకో నీతి ప్రజలకో నీతా అని ఆయన ప్రశ్నించారు.

You might also like