FbTelugu

మద్యపాన నిషేధానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: బాలినేని

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్యపాన నిషేధానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బాలినేని శ్రీనివాసులు అన్నారు. ఇవాళ ఒంగోలులో ఆయన డీ అడిక్షన్ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.

మద్యానికి బానిసలైన వారికి చికిత్స అందించేందుకు ప్రతి జిల్లాలో డీ అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఏపీలో మద్యపాన నిషేధంలో భాగంగానే మద్యం ధరలను పెంచినట్టు తెలిపారు. ఇందుకోసం దుకాణాల సంఖ్యను కూడా తగ్గిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 11 జిల్లాల్లో డీ అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

You might also like