FbTelugu

పేదలను పట్టించుకోవడం లేదు: ఉత్తమ్

హైదరాబాద్: స్పీక్ అప్ ఇండియా పేరుతో ప్రభుత్వంపై కాంగ్రెస్ ఆన్లైన్ పోరాటం మొదలు పెట్టింది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనాతో ఇబ్బందులు పడుతున్న పేదలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు.

వలస కార్మికులకు, నిరుపేదలకు ఆహారం, ఆశ్రయం, భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వలస కూలీలకు సరైన రవాణా సదుపాయం కల్పించకపోవడంతో మార్గమధ్యలోనే ప్రాణాలు విడుస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కరోనా టెస్టులు కూడా సరిగా చేయడం లేదన్నారు.

You might also like