FbTelugu

బంగారు పతకం తెస్తే రూ.3 కోట్లు నజరానా

చెన్నై: జపాన్ దేశం టోక్యోలో జరిగే ఒలింపిక్స్ లో బంగారు పతకం గెలుపొందిన తమిళనాడు క్రీడాకారులకు సిఎం ఎంకె.స్టాలిన్ భారీ నజరానా ప్రకటించారు. బంగారం పతకం తెచ్చిన క్రీడాకారుడికి రూ.3 కోట్ల నగదు బహుమతి అందచేస్తామన్నారు.

రజత పతక విజేతకు రూ.2 కోట్లు, కాంస్య పతక విజేతకు రూ.1 కోటి ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తమ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా పనులు చేస్తున్నదని ఆయన వివరించారు. సమాజంలో అన్ని వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్టాలిన్ స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.