FbTelugu

జగన్ ఏలుబడిలో దేవుళ్లకు రక్షణ లేదు: అచ్చెన్నాయుడు

అమరావతి: టీవీ ఛానళ్ల ముందు, బహిరంగ సభల్లో ఆ దేవుని దయతో అని చెప్పడం కాదని… దేవుళ్లకు జరుగుతున్న అవమానాలపై సీఎం వైఎస్.జగన్ రెడ్డి మాట్లాడాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. మొన్న రామతీర్థం లో శ్రీరాముడి విగ్రహ ఖండన మరువక ముందే రాజమహేంద్రవరం విఘ్నేశ్వరాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతులు విరగ్గోటారన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే దాడులు చేసుకుంటూ పోతే ఆ దేవుడే తగిన సమయంలో శిక్ష విధిస్తారని ఆయన హెచ్చరించారు.

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నాడో లేడో కూడా అర్థం కావడం లేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. దేవుడి మాన్యాలపై ఉన్న శ్రద్ధ దేవాలయాలపై లేదని, ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే టీడీపీ పోరాటం చేస్తుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.