FbTelugu

సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ఆపడమే లక్ష్యం

త్వరలో సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశం

ఏపీ సీఐడీ అదనపు డీజీపీ సునీల్

విశాఖపట్నం: అసభ్య, అభ్యంతరకర, అవమానకరమైన మెసేజ్ లు వేగంగా వ్యాపిస్తున్నాయని, వాటిని ఆపాల్సిన బాధ్యత ఉందని ఏపీ సీఐడీ అదనపు డీజీపీ సునీల్ కుమార్ అన్నారు. వదంతులు, సెలబ్రిటీలపై దుష్ప్రచారం, కుల, మత విద్వేషాల రేపే పోస్టులు ఎక్కువవుతున్నాయన్నారు. ఇందుకోసం సోషల్ మీడియా సంస్ధల సహకారం అవసరం తీసుకోనున్నామన్నారు. సోషల్ మీడియా ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఏ సమాచారం చేరాలన్నా సోషల్ మీడియా వేదికను ఉపయోగించుకుంటున్నారని, వేగంగా సమాచారం వ్యాప్తి లోకి వెళ్తోందన్నారు. దేశంలో 30 కోట్ల మంది ప్రజలు సోషల్ మీడియా వినియోగిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులపై ఐటీ, ఐపీసీ కింద కేసులు నమోదు చేస్తున్నామన్నారు. తప్పుడు వార్తల పరిణామాలు సమాజంపై తీవ్రంగా వుంటున్నాయన్నారు. ఫాస్ట్ కంటెంట్ ఆపడంలో సోషల్ మీడియా ప్రతినిధుల సహకారం అవసరం ఎంతైనా ఉంది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని అవాస్తవాలను ఎలా త్వరితంగా ఆపాలన్నదే మా లక్ష్యమన్నారు. తప్పుడు వార్తలు వచ్చినపుడు సదరు సోషల్ మీడియా సంస్థకు రిక్వెస్ట్ ఎలా పెట్టాలి, న్యాయ నిపుణుల సహకారం ఎలా పొందాలో అవగాహన అవసరం అన్నారు. సమాచారం పరస్పరం ఇచ్చిపుచ్చుకోడానికి ఒక వేదిక అవసరమని ఈ సమావేశం నిర్వహించామన్నారు. ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్స్ తో త్వరలో ఒక సమావేశం పెడతామన్నారు. అన్ వెరిఫైడ్ పోస్టులు ఆపాలన్నది మా ఉద్దేశమన్నారు. ఆ మెసేజ్ ఎవరు పెట్టినా ఆపగలగాలన్నదే మా ప్రయత్నం అన్నారు. మోసపూరిత మెసేజ్ సర్క్యులేట్ అయినప్పుడు వాటిని కట్టడి చేయడం ముందున్న తక్షణావసరం అని సునీల్ కుమార్ అన్నారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More