FbTelugu

ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారం

అనంతపురం: ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న ఓ బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన జిల్లాలోని మడకశిర మండలం చిన్నమట్లగొంది గ్రామంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ బాలికపై కన్నేసిన గ్రామ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like