FbTelugu

దూబేను తరలిస్తున్న వాహనం బోల్తా

భోపాల్: గ్యాంగ్ స్టర్ దూబేను తరలిస్తున్న పోలీసు వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో వికాస్ దూబే పారిపోయేందుకు ప్రాయత్నించగా.. అతనిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో దూబే హతమైనట్టు సమాచారం. అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది.

వికాస్ దూబేని నిన్న పోలీసులు అరెస్టు చేశారు. కాగా అతన్ని ఉజ్జయిని నుంచి కాన్పూర్ కు తరలిస్తుండగా కాన్పూర్ సమీపంలో ప్రమాదం జరిగింది. అరెస్టు చేయడానికి వెళ్లిన 8 మంది పోలీసులను కాల్చిచంపిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.