న్యూఢిల్లీ: లాక్ డౌన్ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ కింది స్థాయిలోని వలస కూలీలు, సన్నకారు రైతులు, వీధుల్లో విక్రయాలు చేసేవాళ్లకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్ర ప్యాకేజీపై ఆమె గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.
భారత ప్రధాని ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరిట ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో రూ.11 వేల కోట్లు పట్టణ ప్రాంతాల్లోని పేదలు, నిరాశ్రయులు, వలస కార్మికులకు సహాయ శిబిరాలు, భోజన ఏర్పాట్ల కోసం రాష్ట్రాలకు కేటాయించినట్టు తెలిపారు. మూడు కోట్ల మంది రైతులకు తగ్గింపు రేట్లతో ఇప్పటికే రూ.4.22 లక్షల కోట్లు రుణాల రూపంలో అందజేసినట్టు తెలిపారు.
వ్యవసాయం, వలస కూలీల సంక్షేమానికి చేపట్టిన చర్యలు…
◆రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తామని, వారి కోసం పలు సంక్షేమ పథకాలు కొనసాగుతాయి.
◆రూ 86,600 కోట్ల వ్యవసాయ రుణాలు.
◆25 లక్షల మంది నూతన కిసాన్‌కార్డు దారులకు రూ 25,000 కోట్ల రుణం.
ప్యాకేజీ వివరాలు
◆మార్చి, ఏప్రిల్‌లో రైతులకు రూ 86,600 కోట్ల రుణాల ఆమోదం..
◆చిన్నసన్నకారు రైతులకు రూ 4 లక్షల కోట్ల రుణాల మంజూరు..
◆25 లక్షల మంది నూతన కిసాన్ కార్డుదారులకు రూ 25,000 కోట్ల రుణం..
◆వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు రాష్ట్రాలకు రూ .6700 కోట్లు..
◆నాబార్డు ద్వారా 29,500 గ్రామీణ బ్యాంకులకు నిధులు…
◆చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు వివిధ పథకాలు..
◆రైతులు,పేదల కోసం 9 పాయింట్ ఫార్ములా..
◆వలస కూలీలను ప్రభుత్వం విస్మరించలేదు..
◆రైతులను ఆదుకునేందుకు ప్యాకేజ్‌లో రెండు పథకాలు..
◆సన్నకారు రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు..
◆రైతులకు మరిన్ని పథకాలు కొనసాగుతాయి..
◆రైతులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అందుబాటులో నగదు..
◆వలస కార్మికుల ఉపాథికి రూ 10,000 కోట్లు..
◆వలస కార్మికులు, వీధి వ్యాపారులపై ప్రత్యేక దృష్టి..
◆రోజుకు కనీస వేతనం రూ 182 నుంచి రూ 202కు పెంపు..
◆పట్టణ పేదల వసతికి రాష్ట్ర విపత్తు నిధుల వినియోగానికి అనుమతి..
◆గ్రామీణ మౌలిక వసతులకు రూ 4200 కోట్లు..
◆ఎస్ఆర్డీఎఫ్ కింద 11,002 కోట్ల నిధులు..
◆మార్చి 1 నుంచి మే 31 వరకూ రుణాలు చెల్లించే రైతులకువారికి వడ్డీ రాయితీ..
◆వచ్చే రెండు నెలలు వలస కూలీలకు ఉచిత రేషన్..
◆రేషన్‌కార్డు లేని వారికి పదికిలోల బియ్యం, శనగలు..
◆నగరాల్లో నిరాశ్రయులకు బలవర్ధక ఆహారం..
◆కార్మికులందరికీ కనీస వేతన హక్కు..
◆ఫ్లాట్‌ఫాం వర్కర్లకు సామాజిక భద్రత పథకం..
◆కార్మికులకు ఉద్యోగ నియామక పత్రాలు..
◆ఈ రేషన్ కార్డుతో ఎక్కడైనా సరుకులు తీసుకునే వెసులుబాటు..
◆రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్‌ల ఏర్పాటు..
◆ప్రధాన నగరాల్లో ప్రభుత్వ నిధులతో నిర్మాణం..