FbTelugu

ఈబీసీలకు జగనన్న వరం: ఏపీ కేబినెట్ ఆమోదం

అమరావతి: సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై ఈ క్రింది నిర్ణయాలు తీసుకున్నది.
ప్రభుత్వ పథకాలతో మొత్తంగా 5 కోట్ల 8 లక్షల 8 వేల 220 మందికి లబ్ధి జరగనున్నది. నెలవారీ ఇచ్చే పెన్షన్లతో కలిపి 5,69,81,184 ప్రయోజనాలు లభించనున్నాయి. మంత్రిమండలి నిర్ణయాలు ఇలా ఉన్నాయి. 2021–22 సంవత్సరానికి సంబంధించి నవరత్నాల అమలు కేలెండర్‌కు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

1. ఆర్ధికంగా వెనుకబడ్డ అగ్రకులాలకు చెందిన మహిళలకు జగనన్న వరం. ఆర్ధికంగా వెనుకబడ్డ వర్గాలకు ఈబీసీ నేస్తం కింద ఏడాదికి రూ.15వేలు. మూడేళ్ల పాటు రూ.45 వేలు. 45 నుంచి 60 ఏళ్ల లోపున్న మహిళలకు వర్తింపు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇది వరకే చేయూత పథకం. కాపులకు కాపు నేస్తం. అదే తరహాలో ఆర్ధికంగా వెనుకబడ్డ ఉన్నత కులాల్లోని మహిళలకు ఈబీసీ నేస్తం వర్తింపు

2. వైఎస్సార్ జగనన్న హౌసింగ్‌ ప్రాజెక్టులో భాగంగా పట్టణాలు, నగరాల్లోని మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలకు ఇళ్ల స్ధలాలు ఇచ్చే కార్యక్రమం కోసం ప్రైవేటు లేఅవుట్లలోని 5 శాతం స్ధలాన్ని కలెక్టర్లకు అప్పగించేలా నిర్ణయం. ప్రైవేటు లేఅవుట్‌లో 5 శాతం భూమి లభ్యత లేకపోతే 3 కిలోమీటర్ల దూరం లోపల కొనుగోలు చేసి కలెక్టర్లకు అప్పగించాలని నిర్ణయం
ఈ ల్యాండ్‌ బ్యాంకును వైయస్సార్‌ జగనన్న హౌసింగ్‌ ప్రాజెక్టుకు వినియోగించనున్న ప్రభుత్వం. పట్టణాలు, నగరాల్లోని మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను నిజం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు

3. 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్ల కోసం పేదల వద్ద నుంచి గత ప్రభుత్వం వసూలు చేసిన డబ్బును తిరిగి వెనక్కి ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం. 1 లక్షా 43 వేల 600 మందికి ఒకే ఒక్క రూపాయితో ఇళ్లను అప్పగిస్తున్న ప్రభుత్వం. 365, 430 చదరపు అడుగులకు సంబంధించి వారు కట్టిన మొత్తంలో 50శాతం డబ్బును సబ్సిడీ రూపంలో ఇస్తున్నట్టు ఇదివరకే అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి.
365 చదరపు అడుగుల లబ్ధిదార్లకు రూ.25వేలు, 430 చదరపు అడుగుల లబ్ధిదార్లకు రూ.50 వేలు సబ్సిడీ ఈ మేరకు మినహాయించిన నగదును వెనక్కి ఇవ్వనున్న ప్రభుత్వం. టిడ్కో కాలనీలకు వైఎస్‌ జగనన్న నగర్‌గా పేరుపెట్టేందుకు కేబినెట్‌ ఆమోదం.

4. అమరావతి ప్రాంతంలో ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (రోడ్లు) మరియు ఎల్‌పియస్‌ పనులు (సమీకరించిన భూముల్లో పనులు)కు సంబంధించి రూ.3వేల కోట్ల నిధులకు ప్రభుత్వ గ్యారంటీ ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం

5. ఆర్బీకేల పరిధిలో మల్టీ పర్పస్‌ సెంటర్లు (బహుళ సదుపాయాల కేంద్రాలు), జనతాబజార్లు, ఫామ్‌ గేటు మౌలికసదుపాయాలు తదితర వాటి ఏర్పాటు విధానానికి సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం
వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో పంట నాటుకునే ముందు, పంట చేతికొచ్చిన తర్వాత రైతుకు కావాల్సిన మౌలిక సదుపాయల కల్పనే ఈ మల్టీ పర్పస్‌ సెంటర్ల ఉద్దేశం. రూ. 2719.11 కోట్లతో ఫామ్‌ గేట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివద్ధి చేసేందుకు కేబినెట్‌ ఆమోదం. ఈ మొత్తం పనులన్నింటినీ సుమారు రూ.12 వేల కోట్లతో చేపట్టనున్న ప్రభుత్వం
6. వైఎస్సార్‌ జిల్లాలో స్టీల్‌ ప్లాంటు నిర్మాణానికి జాయింట్‌ వెంచర్‌ ఎంపిక ప్రక్రియకు కేబినెట్‌ ఆమోదం. ఎస్‌.బి.ఐ క్యాప్‌ సిఫార్సుల ప్రకారం జాయింట్‌ వెంచర్‌ భాగస్వామి ఎంపికకు ఆమోదం. ఎస్‌బీఐ క్యాప్‌ సిఫార్సులను అనుసరించి లిబర్టీ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌ జేవీగా ఎంపిక. తొలిదశలో రూ. 10,082 కోట్ల వ్యయం, రెండో దశలో రూ.6వేల కోట్లు వ్యయం. జేవీపై వైఎస్సార్‌ స్టీల్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీకి ఎల్‌ఓఏ ఇచ్చేందుకు అనుమతి.

7. వైఎస్సార్‌ జిల్లా జమ్ములమడుగు మండలం పెద్దండ్లూరు, సున్నపురాళ్లపల్లె గ్రామాల్లో 3148.68 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌కు కేటాయించేందుకు కేబినెట్‌ ఆమోదం. ఈ స్ధలంలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి నిర్ణయం

8. వైఎస్సార్‌ జిల్లా వల్లూరు మండలం అంబాపురంలో 93.99 ఎకరాల్లో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో మెగా ఇండస్ట్రియల్‌ పార్కు కోసం భూమి కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం.

9. వైఎస్సార్‌ జిల్లా సీ కే దిన్నె మండలం కొప్పర్తిలో 598.59 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్‌ పార్కు నిర్మాణానికి ఏపీఐఐసీకి స్ధలం కేటాయింపు.

10. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం కోన గ్రామంలో 165.34 ఎకరాలు ఏపీ మారిటైం బోర్డుకు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.

11. ఆంధ్రప్రదేశ్‌ గేమింగ్‌ యాక్టు –1974 సవరణకు కేబినెట్‌ ఆమోదం

12. వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు మండలం ముద్దనూరులో నూతన అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌. 12 పోస్టులు మంజూరు.

13. తిరుమల తిరుపతి దేవస్ధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు స్ధలాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం.

14. ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి రెడ్‌హేండెడ్‌గా పట్టుబడ్డ డిసిప్లీనరీ కేసులను 100 రోజుల్లోగా పూర్తి చేయాలని నిర్ణయం, కేబినెట్‌ ఆమోదం.

You might also like

Leave A Reply

Your email address will not be published.