FbTelugu

నేటి నుంచే తొలి విడత పంచాయతీ నామినేషన్లు

విజయవాడ: నేటి నుంచి రాష్ట్రంలో తొలివిడత పంచాయితీ ఎన్నికలకు నామినేషన్లు వేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 168 మండలాలలో గ్రామ పంచాయతీలకు తొలివిడత ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

తొలివిడతలో 3249 గ్రామపంచాయితీలకు, 32504 వార్డులకి ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5గంటల వరకూ నామినేషన్లు స్వీకరణ ఉంటుంది. జనరల్ సర్పంచ్ అభ్యర్ధులకు రూ.3వేలు, రిజర్వుడ్ సర్పంచ్ అభ్యర్ధులకు రూ.1500, జనరల్ వార్డు మెంబర్లకు రూ.1500, రిజర్వుడ్ వార్డు మెంబర్లకు రూ.500 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. నామినేషన్లకు తుది గడువు జనవరి 31గా ఖరారు చేశారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రదర్శన నేటి నుంచి ఉండనున్నది. ఈనెల 31 ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన చేసి, ఫిబ్రవరి 4న మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఇచ్చారు.

ఫిబ్రవరి 9న ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకూ తొలి విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ ఉండనున్నది. అదేరోజు సాయంత్రం 4 నుంచి ఓట్ల లెక్కింపు చేసి, ఫలితాల వెల్లడి చేస్తారు. సర్పంచ్, వార్డు మెంబర్ల ఫలితాల అనంతరం ఉపసర్పంచ్ ల ఎన్నిక అదే రోజు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరిగే రెవెన్యూ డివిజన్లు ఇవే.

 

శ్రీకాకుళం జిల్లా – శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ

విశాఖపట్నం జిల్లా – అనకాపల్లి

తూర్పుగోదావరి జిల్లా – కాకినాడ, పెద్దాపురం

పశ్చిమగోదావరి జిల్లా – నర్సాపురం

కృష్ణా జిల్లా – విజయవాడ

గుంటూరు జిల్లా – తెనాలి

ప్రకాశం జిల్లా – ఒంగోలు

నెల్లూరు జిల్లా – కావలి

కర్నూలు జిల్లా – నంద్యాల, కర్నూలు

అనంతపురం జిల్లా – కదిరి

కడప జిల్లా – జమ్మలమడుగు, కడప, రాజంపేట

చిత్తూరు జిల్లా – చిత్తూరు.

You might also like

Leave A Reply

Your email address will not be published.