FbTelugu

డెల్టా ప్లస్ సొకి తొలి వ్యక్తి మృతి

భోపాల్: డెల్టా ప్లస్ కరోనా వైరస్ అత్యంత ప్రమాదరకం, ఆందోళనకరమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఒకరోజు తరువాత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తొలి మరణం చోటు చేసుకున్నది.
డెల్టా ప్లస్ వైరస్ సోకి చికిత్స పొందుతున్న వ్యక్తి మరణించడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఉజ్జయిని జిల్లాలో ఈ ఘటన జరిగినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో డెల్టా వైరస్ కారణంగానే పలువురు చనిపోతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. డెల్టా కాస్తా ఉత్పరివర్తనం చెంది డెల్టా ప్లస్ రకం గా మార్పు చెందింది. దేశంలో బుధవారం నాటి వరకు 40 కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడులో ఉన్నట్లు తెలిపింది. ఈ రకం వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.