FbTelugu

రైల్వే ఆధ్వర్యంలో తొలి కోవిడ్ ఆస్పత్రి

హైదరాబాద్: దేశంలో రైల్వే ఆధ్వర్యంలో తొలి కరోనా ఆసుపత్రిని నగరంలోని లాలాగూడలో ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళితే.. రైల్వే ఆధ్వర్యంలో నగరంలోని లాలాగూడ సెంట్రల్ ఆస్పత్రిలో తొలి కరోనా ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సెంట్రల్ ఆస్పత్రిలో ప్రత్యేక పడకలు, ల్యాబ్ ను రైల్వే శాఖ ఏర్పాటు చేయిస్తోంది. దక్షిణ మధ్యరైల్వే ఆద్వర్యంలో సిబ్బంది నియమానికి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నెల 15న వీడియో కాల్ ద్వారా ఇంటర్వూలు నిర్వహించనున్నారు.

You might also like