FbTelugu

యూఎస్ లో 24 గంటల్లో వ్యాక్సిన్ తొలి డోస్

అందరికీ ఉచితంగా పంపిణీ…. డొనాల్డ్ ట్రంప్ వెల్లడి

వాషింగ్టన్: ఫైజర్ కంపెనీ తయారు చేసిన కొవాక్స్ వ్యాక్సిన్ తొలి డోస్ ను 24 గంటల్లో ప్రారంభించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తొలుత అమెరికా  నిపుణుల కమిటీ, ఆ తరువాత ఎఫ్.డీ.ఏ ఈ వ్యాక్సిన్ కు అనుమతించింది.

దీంతో పౌరులకు ఇచ్చేందుకు మర్గం సుగమం కావడంతో డొనాల్డ్ ట్రంప్ మీడియాకు వివరాలు వెల్లడించారు. అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీ కి చెందిన బయో ఎన్ టెక్ ఈ వ్యాక్సిన్ ను సంయుక్తంగా తయారు చేసి కొవాక్స్ అనే పేరు పెట్టారు. తొలుత యూకె ప్రభుత్వం దీనికి ఆమోద ముద్ర వేయగా ఆ తరువాత అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రెండు ప్రపంచ దిగ్గజ దేశాలు ఈ వ్యాక్సిన్ కు ఆమోదముద్ర వేయడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.

అమెరికా పౌరులందరికీ కొవాక్స్ వ్యాక్సిన్ రెండు డోసులు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో వ్యాక్సిన్ తయారు చేసి, ఆమోదించుకుని అద్భుత విజయం సాధించామన్నారు. సైన్స్ పరంగా ఇదొక చారిత్రక సందర్భమని ఆయన వ్యాఖ్యానించారు. తొలి డోస్ ఎవరు వేసుకోవాలనే రాష్ట్రా గవర్నర్లు నిర్ణయిస్తారని, ఫ్రంట్ లైన్ వారియర్స్ వైద్య సిబ్బంది తో వృద్ధులకు మొదటి ప్రాధాన్యతనిస్తామన్నారు. కఠినమైన పరీక్షల తరువాత ఈ వ్యాక్సిన్ కు ఆమోదం లభించిందని, 24 గంటల్లోపే ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించినట్లు ట్రంప్ వివరించారు. మిలియన్ల పౌరుల ప్రాణాలకు రక్షణ ఉంటుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన శాస్త్రవేత్తలను అభినందించారు. వ్యాక్సిన్ అభివృద్ధి కోసం 14 బిలియన్ డాలర్లను వెచ్చించామని ట్రంప్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.