FbTelugu

తెలంగాణ మీడియాలో తొలి మరణం

కనీస గౌరవం ఇవ్వని టీవీ5 యాజమాన్యం

హైదరాబాద్: కరోనా పాజిటివ్ తో టీవీ5 రిపోర్టర్ మనోజ్ మృతి చెందినట్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాజారావు తెలిపారు.

తెలంగాణ మీడియాలో తొలి కరోనా మరణం నమోదు అయింది. మిస్త్రినియా గ్రేవీస్ వ్యాధితో బాధపడుతున్న మనోజ్ కు కరోనా సోకడంతో ప్రాణాలు కోల్పోయారని ప్రకటించారు. శ్వాసతో ఇబ్బంది పడుతున్న ఆయనకు ఈ రోజు ఉదయం 8 గంటలకు వెంటిలేటర్ పెట్టారు. కొద్ది సేపటికే మనోజ్ ప్రాణాలు కోల్పోయాడు.

టీవీ5 ముందు టెన్ టీవీ, స్టూడియో ఎన్ టీవీ లో పనిచేశాడు. అందరితో కలుపుగోలుగా ఉంటూ పనిచేసే మనోజ్ మృతిపట్ల సహచరులు ఆవేదన వ్యక్తం చేశారు. మనోజ్ అకాల మరణంతో గ్రేటర్ హైదరాబాద్ లో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్ నుంచి రక్షించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని పలువురు జర్నలిస్టులు కోరుతున్నారు.

స్పందన లేని టీవీ5 యాజమాన్యం…

కరోనా పాజిటివ్ సోకి మనోజ్ మృతి చెందితే కనీసం టీవీ5 యాజమాన్యం స్పందించకపోవడం దారుణమని జర్నలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. చనిపోయిన తరువాత కూడా సంతాపం తెలపరా అంటూ గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్టులు భగ్గుమంటున్నారు.

 

You might also like