FbTelugu

జగన్ బెయిల్ భవితవ్యం 27న

హైదరాబాద్: ఏపి సిఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సిబిఐ ప్రత్యేక కోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్ రద్దు పిటిషన్ అర్హత పై ఈ నెల 27న కోర్టు తీర్పు వెలువరించనున్నది.
జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో వైసిపి ఎంపి కె. రఘురామ కృష్ణమరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై ఇవాళ వాదనలు జరిగాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ పై సీబీఐ 11 చార్జ్ షీట్లు నమోదు చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు విన్పించారు. ప్రతి చార్జ్‌షీట్‌లో జగన్ ఏ1గా ఉన్నారని పిటిషనర్ తెలిపారు. పిటీషనర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నారాయణ రావు వాదనలు వినిపించారు. పిటీషన్ అర్హతపై కోర్టులో వాదనలు కొనసాగాయి. అయితే పిటీషన్‌ను విచారించాలా లేదా అన్నదానిపై ఈ నెల 27న సిబిఐ కోర్టు తన నిర్ణయం వెల్లడించనున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.