FbTelugu

వాగులో కొట్టుకుపోయిన రైతు మృతి

   తిరుపతి:రాగుళ్ల వాగులో కొట్టుకుపోయిన ఓ రైతు మృతి చెందిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకెళితే.. నివర్ తుఫాను కారణంగా వర్షాలు భారీగా కురవడంతో వాగులు పోంగిపొర్లుతున్నాయి.

ఈ క్రమంలోనే నిన్న పొలానికి వెళ్లిన ముగ్గురు రైతులు వరద ఒక్కసారిగా పెరగడంతో రాగుళ్ల వాగులో చిక్కుకు పోయారు. వారిలో ఇద్దరు రైతులను సహాయక సిబ్బంది ప్రాణాలతో కాపాడగా.. ప్రసాద్ అనే రైతు వాగులో కొట్టుకుపోయాడు. ఇవాళ ఓ చెట్టు వద్ద ప్రసాద్ మృతదేహం లభ్యమైంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.