FbTelugu

హైకోర్టును ఆశ్రయించిన ఈటల కుటుంబం

హైదరాబాద్: మెదక్ జిల్లాలో భూకబ్జా ఆరోపణల వ్యవహారంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. ఈటల భార్య జమునా రెడ్డి, కుమారుడు, జమునా హేచరీస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.
జమునా హేచరీస్ భూముల్లో చట్ట విరుద్ధంగా సర్వే చేశారని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. తమకు సంబంధించిన భూముల్లో సర్వే చేసి బోర్డులను పెట్టారని కోర్టుకు విన్నవించారు. తమ భూముల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశించాలని.. బలవంతపు చర్యలు తీసుకోకుండా ఎసిబి డిజి, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, మెదక్‌ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించాలని పిటిషనర్లు కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.