FbTelugu

సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి: ఈటల సవాల్

హైదరాబాద్: తనపై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ కాకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరపాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.

ఇవాళ ఆయన తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ముందస్తు ప్రణాళికతోనే దుష్ప్రచారం చేశారని, తనపై కట్టు కథలు అల్లారని ఆరోపించారు. నా మొత్తం చరిత్ర, ఆస్తులపై విచారణ చేపట్టాలని అన్నారు. ఆస్తులు, పదవుల కోసం ఈటల రాజేందర్ ఏనాడు లొంగడని అన్నారు. నా ఆత్మగౌరవం కంటే ఈ పదవి గొప్పకాదన్నారు. రాష్ట్రంలో కొన్ని టివి ఛానళ్లు పెయిడ్ మీడియా సంస్థలుగా వ్యవహరించారని ఆయన దుయ్యబట్టారు. 1986 నుంచి ఫౌల్ట్రీ వ్యాపారంలో ఉన్నానని, ఏనాడు భూ కబ్జాలకు పాల్పడలేదని ఈటల అన్నారు.

ఫౌల్ట్రీ ఫామ్ కోసం మసాయిపేట మండలం అచ్చంపేటలో అవసరమైన భూమిని కొనుగోలు చేశానని అన్నారు. అయితే అందులో 40 ఎకరాల భూమి రూ.6 లక్షల కు ఎకరా చొప్పున కొనుగోలు చేశానని అన్నారు. ఆ భూమిని రైతులే స్వచ్ఛందంగా సరెండర్ చేశారని, ఈ విషయాన్ని సిఎం కెసిఆర్, సిఎం ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు కు తెలియ చేశానన్నారు. అసైన్డు భూమి అమ్మడం, కొనడం చేయకూడదని, వాళ్లు సరెండర్ చేస్తే ప్రభుత్వం సేకరించి కేటాయిస్తుందని నర్సింగ్ రావు తనకు చెప్పారన్నారు. ఈ భూమిని తనఖా పెట్టి కెనరా బ్యాంకు నుంచి రూ.100 కోట్లు రుణం తీసుకున్నానని ఈటల రాజేందర్  తెలిపారు.

ఆరోపణలు వచ్చాయి కదా రాజీనామా చేస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… నేనెందుకు రాజీనామా చేస్తానని ఈటల ప్రతిస్పందించారు. స్కూటర్ మీద వచ్చిన కొందరు నాయకులు ఇవాళ వందల కోట్ల రూపాయలు సంపాధించారని ఆయన ఆరోపించారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.