FbTelugu

జిల్లా ఎస్పీ ఆఫీసుకు ఆయన పేరు పెట్టాలి

ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్

సూర్యాపేట: నగరంలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా కలెక్టరేట్ లేదా జిల్లా ఎస్పీ కార్యాలయం భవన సముదాయానికి కల్నల్ సంతోష్ బాబు పేరు పెట్టాలని సూర్యాపేట జిల్లా ఆప్ కన్వీనర్ లింగిడి వేంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

ఈ మేరకు వేంకటేశ్వర్లు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. భవనానికి పేరు పెట్టడమే కాకుండా ఆవరణలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. లద్దాఖ్ లోని గల్వన్ లోయలో చైనా సైనికుల దాడిలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు స్మృత్యర్థం పేరు పెట్టడంతో పాటు, విగ్రహం ఏర్పాటు చేస్తే భావి తరాలకు ఆదర్శంగా ఉంటుందని ఆయన విన్నవించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.