FbTelugu

నటి వాణిశ్రీ కుమారుడు మృతి

చెన్నై: ప్రముఖ నటీమణి వాణిశ్రీ కుమారుడు అభినయ్ వెంకటేష్ గుండెపోటుతో మృతిచెందారు. ఊటీలో డాక్టర్ గా పనిచేస్తున్న ఆయన ప్యాలెస్ పనుల కోసం చెంగల్ పట్టుకు వెళ్లారు.

రాత్రి తన కుమారుడితో సరదాగా గడిపిన వెంకటేష్ ఉదయం గుండెపోటు రావడంతో చనిపోయాడని అంటున్నారు. నిద్రలోనే గుండెపోటు రావడంతో విగత జీవుడు అయ్యారని సన్నిహితులు తెలిపారు. వెంకటేష్ భార్య కూడా డాక్టర్ గా సావిత్రి మనమరాలి ఆసుపత్రిలో పనిచేస్తున్నది.

వెంకటేష్ మృతదేహాన్ని చెన్నైకి ఇవాళ తరలించారు. ఈరోజే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు వాణిశ్రీకి ఫోన్ చేసి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

You might also like