FbTelugu

రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున దీక్ష చేయాలి: ఉత్తమ్

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున పెండింగ్ ప్రాజెక్టులపై దీక్ష చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.

తెలంగాణ నీళ్లను జగన్ తరలించుకుపోతుంటే కేసీఆర్ నోరు మెదపడం లేదని అన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.203 అమలైతే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందన్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో పారే నీటికన్నా.. రెండితల నీళ్లు పోతిరెడ్డి పాడు ద్వారా తరలించుకుపోతున్నారని అన్నారు.

You might also like