FbTelugu

భైంసాలో కర్ఫ్యూ కొనసాగుతుంది: ఎస్పీ

నిర్మల్: భైంసాలో కర్ఫ్యూ కొనసాగుతుందని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు.

ప్రజలు సంయమనం పాటించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని సూచించారు. భైంసాలో జరిగిన మతఘర్షణలో 21 మందిని, లాక్ డౌన్ ఉల్లంఘించిన మరో 40 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

You might also like